న్యూజెర్సి తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నీ

న్యూజెర్సిలోని తెలుగు కళా సమితి (టిఫాస్) 40వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా న్యూజెర్సీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది. సౌత్ ప్లెయిన్ఫీల్డ్లోని బ్యాడ్మింటన్ క్లబ్లో ఈ టోర్నీ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20వ తేదీ ఆదివారం నాడు ఈ టోర్నీ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 13-18 సంవత్సరాల మధ్య వయసున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో పాల్గొనేందుకు https://tinyurl.com/TFAS40BadmintonSingles లింకులో, డబుల్స్ విభాగం కోసం https://tinyurl.com/TFAS40BadmintonDoubles లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల ఆఖరు తేదీ ఆగస్టు 17.