యువత కోసం నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ

యువతలో ఉత్సాహం నింపేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అగ్రరాజ్యంలో తెలుగు వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టే నాట్స్.. అక్టోబర్ 1న డల్లాస్‌లో ఈ వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తోంది. ఇక్కడి ఎంఏసీ స్పోర్ట్స్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. దీనిలో పాల్గొనాలని అనుకునే జట్లు 150 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం https://natsworld.org/dallasvb2023 లింకులో రిజిస్టర్ చేసుకోవాలి.