అగ్రరాజ్యంలో శ్రీ శివ విష్ణు ఆలయం ఆధ్వర్యంలో ‘గీతా గాన ప్రవచనం’

అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న శ్రీ శివ విష్ణు ఆలయం ఆధ్వర్యంలో ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బ్రహ్మ శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి గారు ఈ ప్రవచనం వినిపించనున్నారు. శనివారం నాడు సాయంత్రం 5 గంటల కమ్యూనిటీ హాల్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.