2 లక్షల బహుమతులు అందించే ఆటా నవలల పోటీలు!

అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18వ మహాసభల సందర్భంగా నవలల పోటీ నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 7,8,9 తేదీల్లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ నవలల పోటీ విజేతలకు రూ.2 లక్షల విలువైన బహుమతులు అందించనున్నారు. అయితే ఈ నవలలు కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలి. ప్రపంచంలోని ఏ ప్రాంతం నేపథ్యంలో అయినా నవలలు ఉండొచ్చు. కానీ కథలు మాత్రం తెలుగు వారి జీవితాలు సంబంధించినవై ఉండాలి. కనీసం 150 పేజీలు ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఉండేవారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, రవి వీరెల్లి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 14వ తేదీలోగా నవలలను తమకు పంపాలని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే atalovels2024@gmial.com ను మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.