ఆటా ఆధ్వర్యంలో ఉచితంగా మెడిటేషన్ క్లాసులు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో మనసు సేద తీర్చే మెడిటేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. సర్టిఫైడ్ ట్రైనర్ల ద్వారా ప్రతివారం ఈ క్లాసులు ఏర్పాటు చేశారు. ఈ ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్’ క్లాసులను ఆటా ఉచితంగా అందిస్తోంది. ప్రముఖ మెడిటేషన్ ట్రైనర్లు అయిన ఉమా ముళ్లపూడి, భవానీ శంకర్ ఈ క్లాసుల్లో మెడిటేషన్ మెళకువలు తెలియజేయనున్నారు. ఈ క్లాసులు వినాలనుకునే వారు https://forms.gle/25CopGpoM7Y3BFyx7 లింకులో జాయిన్ అవ్వొచ్చు. అక్టోబర్ 22 వరకు ప్రతి ఆదివారం ఈ క్లాసులు ఉంటాయి.