VV Vinayak: వెంకీ కోసం వినాయక్ ప్రయత్నాలు?
ఈ ఏడాది పండక్కి సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్(venkatesh). అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ తో పాటూ కలెక్షన్లను కూడా అందుకుంది. ఆ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీని ఎవరితో చేయాలా అని ఆలోచించిన వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తో తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ త్రివిక్రమ్- వెంకీ(Venky) సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ కు వెళ్లనుందీ సినిమా. ఇదిలా ఉంటే ఇప్పుడో డైరెక్టర్ వెంకీ కోసం ఓ మాస్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. అతను మరెవరో కాదు, ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వినాయక్(Vinayak). గత కొన్నేళ్లుగా వినాయక్ కెరీర్ ఫామ్ లో లేదు.
ఇంటెలిజెంట్(Intelligent) డిజాస్టర్ తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న వినాయక్, బాలీవుడ్ లో ఛత్రపతి(Chatrapati) సినిమాను రీమేక్ చేస్తే ఆ సినిమా కూడా ఫ్లాపవడంతో నిరాశే మిగిలింది. దీంతో ఇప్పుడు తిరిగి టాలీవుడ్ పైనే ఫోకస్ చేసి వెంకీతో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట. త్వరలోనే వెంకీని కలిసి వినాయక్ కథను చెప్పనున్నాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే వీరిద్దరి కాంబినేషన్ లో క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. గతంలో వీరిద్దరూ కలిసి లక్ష్మి(Lakshmi) అనే సినిమా చేయగా అది వెంకీ కెరీర్లో మంచి మైల్స్టోన్ ఫిల్మ్ గా నిలిచిన విషయం తెలిసిందే.







