Urmila Matondkar: రీఎంట్రీకి కోసం ఫిట్ గా మారిన ఊర్మిళ

రంగీలా సినిమాలోని యాయీరే యాయీరే సాంగ్ ను, అందులో నటించిన ఊర్మిళను 90స్ యూత్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్టరే. సినీ చరిత్రలో తమకంటూ ఓ పేజ్ ను రాసుకున్న నటీమణుల్లో ఊర్మిళ మటోండ్కర్ కూడా ఒకరు. సినీ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న ఊర్మిళ దాని కోసం పర్ఫెక్ట్ ఫిట్ లుక్ లోకి మారిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తుండగా, తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటల్లో ఊర్మిళ బ్లాక్ ఫ్రాక్ ధరించి ఎంతో ఫిట్ గా కనిపిస్తోంది. ఊర్మిళకు సంబంధించిన ఈ కొత్త ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతుంది.