Sree Vishnu: డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై శ్రీవిష్ణు క్లారిటీ
కెరీర్ స్టార్టింగ్ నుంచి రకరకాల సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూ కొత్త ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు(Sree Vishnu). అయితే శ్రీవిష్ణు పై గత రెండు సినిమాలుగా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీవిష్ణు తన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులను అర్థం కాకుండా మాట్లాడతాడని అంటుంటారు.
తాజాగా తన కొత్త సినిమా సింగిల్(Single) ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా నుంచి ఇదే ప్రశ్న శ్రీవిష్ణుకి ఎదురైంది. దీనికి శ్రీవిష్ణు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తన సినిమాల్లో అసలు ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు ఉండవని, తాను మాట్లాడేది సంస్కృతమని అది అర్థం కాక అందరూ తాను బూతులు మాట్లాడుతున్నాననుకుంటున్నారని చెప్పాడు.
తన డైలాగులను మామూలుగా ఫాస్ట్ గా కాకుండా ఓటీటీలో వచ్చాక స్పీడ్ తగ్గించి చెక్ చేస్తే అర్థమవుతుందని, అర్థం కాలేదని ఇప్పుడూ అందరికీ తాను సంస్కృతాన్ని నేర్పలేనని శ్రీవిష్ణు సరదాగా వ్యాఖ్యానించాడు. గతంలో శ్రీవిష్ణు చేసిన స్వాగ్(Swag) ఇంటర్వెల్ లో వచ్చే బీజీఎం గురించి కూడా నెటిజన్లు ఇంతే అంటుంటే దానిపై డైరెక్టర్ హసిత్(Hasith) క్లారిటీ ఇచ్చాడు.






