Saptami Gowda: లంగా ఓణీలో సప్తమి పండగ అందాలు
ఒకప్పట్లో హీరోయిన్లు అంటే కేవలం యాక్టింగ్ తోనే మెప్పించాలి. కానీ ఇప్పుడలా కాదు, తమ అందాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. సినిమాలతో ఆడియన్స్ కు పరిచయమై, సోషల్ మీడియా ద్వారా వారికి మరింత దగ్గరవుతున్నారు. కాంతార మూవీలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ(Saptami Gowda), ఆ తర్వాత బాలీవుడ్ లో, తెలుగులో కూడా సినిమా చేసింది. తాజాగా సప్తమి గౌడ సంక్రాంతి సందర్భంగా కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సప్తమి లంగా ఓణీ, చేతికి గాజులు, అవుట్‌ఫిట్ కు తగ్గ కాస్ట్యూమ్స్ వేసుకుని ఎంతో అందంగా కనిపించగా ఆ ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు కొడుతూ వాటిని నెట్టింట షేర్ చేస్తున్నారు.






