Bakasura Restaurant: కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న బకాసుర రెస్టారెంట్

రేసు గుర్రం(Race gurram), దువ్వాడ జగన్నాథమ్(Duvvada Jagannadham), ప్రేమ కథా చిత్రమ్(Prema Katha Chitram) సినిమాలతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్(Praveen) త్వరలోనే బకాసుర అనే పేరుతో రెస్టారెంట్ ను స్టార్ట్ చేస్తున్నాడని వార్తలొచ్చాయన్న సంగతి తెలిసిందే. ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న ప్రవీణ్ కు అంత తీరిక ఎక్కడుందా అని అనుకుంటున్న టైమ్ లో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.
ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్(Bakasura Restaurant) అనే పేరుతో సినిమాను చేస్తున్నాడు. రెస్టారెంట్ ను స్టార్ట్ చేయడం లేదు. ఆ సినిమాలో ప్రవీణ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో ప్రవీణ్ పెద్ద గరిట పట్టుకుని వంట చేస్తూ కనిపించాడు. ప్రవీణ్ పక్కన విచిత్రమైన ఆకారాల్లో వైవా హర్ష(Viva Harsha), షైనింగ్ ఫణి(Shining Phani) కనిపించారు.
వాళ్లతో పాటూ పోస్టర్ లో పాత బంగళా, ఓ మర్రిచెట్టు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటూ హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో ఎస్‌జె శివ(SJ Siva) డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. హంగర్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది.