‘ది కిల్లర్’ ట్రైలర్ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

కార్తీక్‍సాయి హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ది కిల్లర్. డాలీషా, నేహాదేశ్ పాండే నాయికలు. ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మాతలు. ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‍లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‍గౌడ్ హాజరయ్యారు. ఆయన ట్రైలర్‍ని విడుదల చేయగా, కథానాయకుడు సోహైల్ బిగ్ టికెట్‍ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‍గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిభ కలిగిన చాలా మంది సినిమా రంగం లోకి అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రంగానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు అన్నారు. కార్తీక్‍సాయి మాట్లాడుతూ విడుదల రోజు ఉదయం ఆట అన్ని కేంద్రాల్లో ఉచితంగా చూడొచ్చు. చూశాక సినిమా గురించి పదిమందికి చెప్పాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా అన్నారు.