Mega157: అనిల్ మరీ ఇంత ఫాస్టా?

సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమా తర్వాత అనిల్ రావిపూడి(anil ravipudi) మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా157(mega157) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అసలే క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండగా, ఆ అంచనాలను అనిల్ మరింత పెంచుతున్నాడు.
ఉగాదికి సినిమాను అనౌన్స్ చేసిన అనిల్, ఆ తర్వాత వెంటనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి అనుకున్న దాని కంటే ఒక రోజు ముందుగానే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ కోసం ముస్సోరికి వెళ్లగా, ఇప్పుడు రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో చిరూపై కొన్ని హై ఓల్టేజ్ సీన్స్ ను అనిల్ షూట్ చేసినట్టు తెలుస్తోంది.
చూస్తుంటే అనిల్ తన కెరీర్లోనే అతి తక్కువ టైమ్ లో ఈ సినిమాను పూర్తి చేసేట్టు కనిపిస్తున్నాడు. అనిల్ స్పీడు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ అనిల్ ఇంత ఫాస్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నయనతార(nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి(sahu garapati), సుస్మిత(susmitha) ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.