Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

ప్రేమ్, వాసంతిక హీరో హీరొయిన్లు గా దళపతి, రాహుల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మావా (Mawa) సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, వెంకటేష్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఏ.ఆర్.ప్రభావ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, వెంకటేష్ బాలసాని నిర్మాతగా ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. మూవీ నిర్మాత వెంకటేష్ బాలసాని క్లాప్ ఇవ్వగా ఆయన సతీమణి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు, మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య సిరికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
మావా సినిమా స్నేహం మీద సాగే ఒక ఎమోషనల్ జర్నీ, స్నేహం మీద చాలా చిత్రాలు వచ్చాయి కానీ దర్శకుడు ఏఆర్.ప్రభావ్ ఫ్రెండ్షిప్ లో సరికొత్త పాయింట్ తో రాబోతున్నారు. ముగ్గురు అబ్బయిల మధ్య ఉండే స్నేహాన్ని ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించబోతున్నారు.
అక్టోబర్ 3 నుండి హైదరాబాద్ లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈశ్వర్ రావ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు, కోటి ఈ చిత్రానికి ఎడిటర్.