సూపర్‍స్టార్ విడుదల చేసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్

సుధీర్‍బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎంఎం పతాకంపై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‍ను సూపర్‍స్టార్ మహేష్‍బాబు చేతులమీదుగా విడుదల చేశారు.
శ్రీదేవి సోడా సెంటర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు మహేష్‍బాబు అన్నారు. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్‍బాబు గ్రామీణా యువకుడిగా కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, కుటుంబ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదలైన ట్రైలర్‍లో సుధీర్ నటన మునుపెన్నడూ లేనివిధంగా ఆకట్టుకునేలా ఉంది. విజయ్ చిల్లా. శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్‍బాబు ఇంట్రడక్షన్ టీజర్‍కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుంది.