Katalaan: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ “కటాలన్” మాస్ అవతార్‌తో సెకండ్ షాకింగ్ లుక్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’ సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన సెకండ్ లుక్‌లోనూ పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు.
మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనున్న ‘కటాలన్’, మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ తర్వాత క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న మూవీ. మాస్ అప్పీల్ , యాక్షన్ పరంగా ఈ సినిమా ‘మార్కో’ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని పోస్టర్లు సూచిస్తున్నాయి.
ఈ చిత్రం మొదటి టీజర్ జనవరి 16న విడుదల కానుంది. ‘కటాలన్’ ఇప్పటికే మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌లో దక్కించుకుందని, షూటింగ్ పూర్తి కాకముందే అనేక ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టింది . ఫార్స్ ఫిల్మ్స్‌తో కలిసి, ‘కటాలన్’ ఒక మలయాళ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది.
యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “పాంగ్” అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని కాంతార, మహారాజ వంటి బ్లాక్బస్టర్లతో దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు. పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు నటుడు సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు.
కటాలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.






