Kajal: రిస్క్ చేయబోతున్న కాజల్?

ఒకప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేయడంతో పాటూ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్(kajal aggarwal). కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు(gowtham kitchlu)ని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చి కొన్నాళ్ల పాటూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది కాజల్.
మళ్లీ ఈ మధ్యే సినిమాల్లోకి వచ్చి బిజీ అవాలనుకుంటుంది కాజల్. అయితే రీఎంట్రీ తర్వాత కాజల్ కు చెప్పుకోదగ్గ హిట్లు పడలేదు. భగవంత్ కేసరి(bhagavanth kesari) హిట్టైనా అది బాలయ్య అకౌంట్ లోనే పడింది. దీంతో ఎలాగైనా మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవాలని డిసైడ్ అయిన కాజల్ తన వద్దకు వచ్చిన అవకాశాలను అందుకోవడంతో పాటూ, మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అవాలని నిర్ణయించుకుంది.
అక్కడితో ఆగడం లేదు కాజల్. డైరెక్టర్ గా కాజల్ డెబ్యూ చేయబోతున్న సినిమాలో తానే ప్రధాన పాత్రలో కనిపించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కాజల్ ఓ బోల్డ్ రోల్ లో కనిపించనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ డైరెక్టర్ గా మారడమే కాకుండా అందులో లీడ్ రోల్ లో నటిస్తుందంటే కాజల్ ఈ ప్రాజెక్టుతో రిస్క్ చేస్తున్నట్టే.