‘జీఎస్‍టీ’ ట్రైలర్‍ను విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్ యాదవ్

ఆనంద్‍కృష్ణ, స్వాతిమండల్, అశోక్, ఇందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జీఎస్‍టీ. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‍ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టైటిల్, ట్రైలర్ బాగున్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి అని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ దేవుడు, దయ్యం, సైన్స్ పట్ల సమా•ంలో ఉన్న అనుమానాలు, అపోహల్ని చర్చిస్తూ రూపొందిన చిత్రమిది. వాటిలో ఏది నిజం? ఏది అబద్ధమనే అంశాన్ని ఎలా చెప్పామన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రేమ, వినోదం, హారర్‍తో పాటు వాణిజ్య హంగులన్నీ ఉంటాయి. సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకముందని నాయకానాయికలు చెప్పారు. ఈ నెల 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కొమారి జానకిరామ్ దర్శకుడు. కొమారి జానయ్యనాయుడు నిర్మాత.