Ghaati: ఘాటీ కోసం స్వీటీ వస్తుందా?

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) తర్వాత అనుష్క(anushka) నుంచి మరో సినిమా వచ్చింది లేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత అనుష్క ఘాటీ(ghaati) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి(krish jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్నప్పటికీ మేకర్స్ ఇప్పటి వరకు ఘాటీకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు.
తాజా సమాచారం ప్రకారం జూన్ 21న ఘాటీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. రిలీజ్ కు రెండు వారాల ముందుగా ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారట. అయితే గత కొన్ని సినిమాలుగా అనుష్క బరువు పెరిగి లావుగా కనిపిస్తున్నందున ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
కానీ ఈసారి అనుష్క కూడా ఘాటీ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలతో పాటూ ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా తాను పాల్గొంటానని అనుష్క చిత్ర యూనిట్ కు చెప్పినట్టు సమాచారం. అనుష్క వచ్చే వరకు క్రిష్(krish) ఈ సినిమాను ప్రమోట్ చేయనుండగా, ఆమె వచ్చాక ఇద్దరూ కలిసి ఘాటీని ప్రమోట్ చేయబోతున్నారు. ఏదేమైనా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఇకనైనా స్పీడు పెంచాల్సిన అవసరం ఉంది.