Deva katta: దేవా కట్టాను ఆశ్చర్యపరిచిన ఆది
టాలీవుడ్ లోని టాలెంటెడ్ యాక్టర్లలో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) కూడా ఒకడు. తన తండ్రి రవి రాజా పినిశెట్టి(raviraja pinisetty) మంచి డైరెక్టర్ అయినప్పటికీ ఆది ఎప్పుడూ తన బ్యాక్ గ్రౌండ్ ను వాడుకుని సినిమాల్లో అవకాశాలు అందుకోలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని కోరుకుని దాని కోసమే తెగ కష్టపడుతూ వస్తున్నాడు.
రీసెంట్ గా మయసభ(mayasabha) వెబ్‌సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆది పినిశెట్టి అందులో కెకెఎన్ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయి నటించడంతో పాటూ ఆ పాత్రను తన భుజాలపై మోసి సిరీస్ ను సక్సెస్ చేశాడు. మయసభ సక్సెస్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ దేవ కట్టా(deva katta) రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆది పినిశెట్టి గురించి మాట్లాడాడు.
హీరోగా అయినా, విలన్ గా అయినా ఆది చాలా గొప్ప నటనను ప్రదర్శించగలడని, నిన్ను కోరి(ninnu kori) సినిమాలో అతని యాక్టింగ్, డిక్షన్ చూసి ఆశ్చర్యపోయానని, మయసభ ఓటీటీ ఫార్మాట్ కు మారినప్పుడు తనకు ముందు గుర్తొచ్చిన హీరో ఆదినే అని, వెంటనే ఆదికి స్క్రిప్ట్ పంపి 8 గంటల పాటూ జూమ్ లో దాన్ని వివరించానని, తాను చెప్పిన కథను ఆది చాలా మెరుగ్గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడని దేవా కట్టా తెలిపాడు.







