Ajay Bhupathi: అజయ్ భూపతి నెక్ట్స్ మూవీ టైటిల్ అదేనా?
ఆర్ఎక్స్100(RX100) సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి(ajay bhupathi) ఫస్ట్ మూవీతోనే డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ లో మ్యాటర్ ఉందనిపించుకున్న అజయ్ భూపతి తర్వాతి సినిమాగా భారీ క్యాస్టింగ్ తో మహా సముద్రం(maha samudram) అనే సినిమాను తీయగా భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో తన సత్తాను అజయ్ మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైమ్ లో మరోసారి మొదటి సినిమాలోని పాయల్ రాజ్‌పుత్(payal Rajputh) తో మంగళవారం(mangalavaram) సినిమా చేసి మరో సూపర్‌హిట్ ను అందుకున్న అజయ్ భూపతిపై మళ్లీ అందరికీ నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే కృష్ణ(Krishna) మనవడు, రమేష్ బాబు(ramesh babu) కొడుకు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni jaya krishna) డెబ్యూ సినిమాను అజయ్ భూపతికి అప్పగించారు.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలవగా, అక్టోబర్ నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందంటున్నారు. ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట. తిరుపతి పక్కన ఓ గ్రామమైన ఆ ఊరి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని, సినిమాలో లవ్ స్టోరీతో పాటూ యాక్షన్ కూడా ఉంటుందని, ఈ మూవీలో రషా తదానీ(Rasha thadani) హీరోయిన్ గా నటించనుందని సమాచారం.







