SBI : ఎస్‌బీఐ కీలక నిర్ణయం… మరోసారి

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed deposits) పై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. శుక్రవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. రేట్ల కోతపై ఎస్‌బీఐ ఇప్పటికే బ్యాంకు సిబ్బంది (Bank staff) కి సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ ఇచ్చే 444 రోజుల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ (Special Deposit Scheme) అమృత్ వృష్టితో పాటు అన్ని కాలావధి డిపాజిట్లపై ఈ కోత ఉంటుందని బ్యాంకు తెలిపింది. 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై ఇప్పటివరకు 7.05 శాతం వడ్డీ ఇవ్వగా, ఇప్పుడు దాన్ని 6.85 కు తగ్గించింది. రూ.3 కోట్ల లోపు ఎఫ్‌డీలపై 1-2 ఏళ్ల వ్యవధికి వడ్డీ రేటును 6.50 శాతానికి కుదించింది. డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ తగ్గించడం నెల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.