Mukesh Ambani: ప్రధాని నరేంద్ర మోదీ పై … ముకేశ్ అంబానీ ప్రశంసలు

ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Rising Northeast Investors Summit)లో అంబానీ మాట్లాడారు. మోదీ నాయకత్వ పటిమను కొనియాడుతూ, సెల్యూట్ చేస్తున్నా అని అన్నారు. అలాగే భద్రతాబలగాల దైర్యసాహసాలను అభినందించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయం ఈ రెండు లక్షణాలకు గొప్ప నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మోదీ కూడా పాల్గొన్నారు.
దేశ రాధానిలోని భారత మండపంలో రెండురోజుల పాటు జరిగే రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ భిన్నత్వంతో కూడిన మన దేశంలో ఈశాన్య ప్రాంతం మరింత వైవిద్యభరితమైందని అన్నారు. ఈశాన్య భారతం ఒక పవర్‌హౌస్ అని, మనకు అష్టలక్ష్మి వంటిదని అభివర్ణించారు.