LIC: ప్రపంచ రికార్డు సృష్టించిన ఎల్ఐసీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసీ) పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (Guinness Book of World Records)లకెక్కింది. 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలు జారీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్ఐసీ. ఈ సందర్భంగా ఎల్ఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు (LIC agents) కలిసి 24 గంటల్లో మొత్తం 5,88,107 జీవిత బీమా పాలసీ (Life insurance policy)లను జారీ చేశారని, ఇది ఓ ప్రపంచ రికార్డు అని జీవిత బీమా సంస్థ తెలిపింది. ఈ ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైని పేర్కొంది. ఇది ఘనత తమ ఏజెంట్ల అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత కృషికి నిదర్శనమని ఎల్ఐసీ చెప్పుకొచ్చింది.







