EPF : ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును కేంద్రం ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి (Employee Provident Fund) సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటు (Interest rate )ను యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.