Dr. Reddy’s : డాక్టర్ రెడ్డీస్ ఏపీఐ ప్లాంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 2 అభ్యంతరాలు

తెలంగాణ (Telangana ) లోని మిర్యాలగూడలో ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ( ఏపీఐ) ప్లాంట్‌ను అమెరికా ఔషద నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీ చేసిన తర్వాత, రెండు అభ్యంతరాలతో ఫారం 483 జారీ చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ (Dr. Reddy’s) వెల్లడిరచింది. మిరాల్యాగూడ (Miralagiaguda) లోకి కంపెనీ ఏపీఐ తయారీ కేంద్రం ( సీటీఓ-5)లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు యూఎస్‌ఎఫ్‌డీఏ (USFDA) తనిఖీ చేసింది. నిర్దేశించిన సమయంలోగానే యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలపై సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. తనిఖీల సందర్భంగా ఫుడ్ డ్రగ్, కాస్మోటిక్ చట్టం, సంబంధిత చట్టాల్లో ఏమైనా ఉల్లంఘనలు కనిపిస్తే, యూఎస్‌ఎఫ్‌డీఏ ఫారం 483 జారీ చేస్తుంది.