Apple : భారత్‌కు నిరాశే.. యాపిల్ లాగేస్తున్న ట్రంప్!

యాపిల్ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకున్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వయంగా టిమ్‌కుక్ (Timkuk)తో మాట్లాడి, భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దని కోరారట. ఈ విషయాన్ని అధ్యక్షుడే స్వయంగా వెల్లడిరచారు. నాకు టిమ్ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైంది. అతడు భారత్ (India)లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పారు. ఫలితంగా అమెరికా (America)లో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ (Apple) అంగీకరించింది అని వ్యాఖ్యానించారు. ఖతార్‌లో జరిగిన ఓ సమావేశం సందర్బంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా ఉత్పత్తులపై అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.