Accenture : యాక్సెంచర్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ (Accenture) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 50 వేల మందికి ప్రమోషన్లు (Promotions )ఇవ్వనుంది. భారత్‌లోని 15 వేల మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించనుంది. కన్సల్టింగ్ సేవలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే ప్రమోషన్లు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. ఉద్యోగుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు జూన్ (June)లో ప్రమోషన్లు ఇవ్వనుంది. భారత్ (India)లో 15 వేలు, యూరప్‌లో 11 వేలు, పశ్చిమాసియా, ఆఫ్రికా (Africa) లో కలిపి 11 వేలు, అమెరికా (America) లో 10 వేల మంది చొప్పున ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తమ సిబ్బందికి పంపిన అంతర్గత సమాచారంలో తెలిపింది. ప్రస్తుతం యాక్సెంచర్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తం సిబ్బందిలో జూన్ 6 శాతం మంది సిబ్బంది ప్రమోషన్లు అందుకోనున్నారు. వాస్తవానికి డిసెంబర్‌లోనే ప్రమోషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది.