జి-7 దేశాలకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి ... వింటర్ రాకముందే

జి-7 దేశాలకు  జెలెన్‌స్కీ విజ్ఞప్తి ... వింటర్ రాకముందే

శీతాకాలం రాకముందే రష్యా యుద్దాన్ని ఆపించేందుకు జి-7 కూమిటి దేశాల అధినేతలు ప్రయత్నించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. జి-7 దేశాల అధినేతల సమావేశంలో వర్చువల్‌గా ప్రసంగిస్తూ శీతాకాలం ప్రారంభమైతే ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందనీ, తమ సేనలకే కాక, రష్యన్‌ సేనలకు కూడా అది ఇబ్బందేనని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాల్లో యుద్ధం సాగుతోందనీ, ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యన్‌ దళాలు అడ్డుకుంటున్నాయనీ, దీని వల్ల ఆహార  సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలను కఠినంగా అమలు జరిపేట్టు చూడాలని జి-7 దేశాల అధిపతులను ఆయన కోరారు. రష్యాపై కొత్త తరహా ఆంక్షలు విధించే అంశంపై జి-7 దేశాల అధినేతలు చర్చిస్తున్నట్టు తెలియగానే ఆయన ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

 

Tags :