ASBL NSL Infratech

అకీరా-ఆద్య ఇంటి పేరు పై నెట్టింట దుమారం..

అకీరా-ఆద్య ఇంటి పేరు పై నెట్టింట దుమారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, పిల్లలు విషయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంత కీలకపాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా అతను నామినేషన్ వేసిన సమయంలో సబ్మిట్ చేసిన అఫిడివిటీలోని వివరాలు మరొకసారి వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ అఫిడివిటీ ఇప్పటివరకు తెలియని కొన్ని విషయాలను ప్రజల మధ్యకు తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్..రేణు దేశాయ్.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన ఈ జంటకు అకిరా, ఆధ్యా అని ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్నటి వరకు వీరి పేరు వెనక కొణిదల ఇంటిపేరు ఉంది అని అందరూ భావిస్తూ వచ్చారు.. కొణిదల వారసులుగానే వాళ్లని పరిగణించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ అందించిన అఫీడివిటీలో అకిరా నందన్, ఆద్య పేరు వెనక కొణిదల కాకుండా దేశాయ్ అని ఉంది. అంతేకాకుండా వీరి పేరు మీద పవన్ కి సంబంధించిన ఎటువంటి ఆస్తులు లేవు. ఈ వివరాలు బయటకు రావడంతో ప్రస్తుతం ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీతులు ఉన్నవి పక్కన వాళ్లకు చెప్పడానికేనా.. పాటించడానికి కాదా.. అని కొందరు ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీనికి ఎటువంటి ఆన్సర్ ఇస్తారో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :