ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'ఆళ్ల' రాజీనామా వెనక..?

'ఆళ్ల' రాజీనామా వెనక..?

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో పదవికి రిజైన్ చేశారు.స్పీకర్‌ కార్యదర్శికి రాజీనామా లేఖను ఆర్కే అందజేశారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. ఆర్కే రాజీనామా వైసీపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆర్కే రాజీనామాపై వైసీపీ శ్రేణుల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బరిలోకి దిగారు. అయితే నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి పోటీ చేయడంతో గెలుపు తథ్యమనే అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక కేసులు వేస్తూ టీడీపీని ముప్పు తిప్పలు పెడుతూ వచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

అయితే గంజి చిరంజీవి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసహనంతో ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు గంజి చిరంజీవి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఆదివారం నియోజకవర్గంలో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు గంజి చిరంజీవి. మరోవైపు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రాజీనామా వెనక కారణాలు ఇవే అంటూ ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ ను ఓడించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఆయన.. నియోజకవర్గంలో అభివృద్ధి కూడా బాగా చేశారు.

రాబోయే ఎన్నికల్లో సీటు విషయంలో సీఎం వైఎస్ జగన్ నుంచి క్లారిటీ లేకపోవటం ఒక కారణమైతే.. ఇటీవలే టీడీపీ నుంచి గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి సీటు చిరంజీవికే అని అధిష్టానం కన్ఫామ్ చేసినట్లు సమాచారం ఉండటంతోనే.. ఆళ్ల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం (పద్మశాలి) ఓట్లు అత్యధికంగా ఉండడం.. గంజి చిరంజీవికి సానుకూలంగా మారింది. ఫస్ట్ టైం చిరంజీవిపైనే కేవలం 14 ఓట్ల తేడాతో గెలిచారు ఆళ్ల.. రెండోసారి నారా లోకేష్ పై గెలిచాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్లను కాదని.. రాబోయే ఎన్నికల్లో చిరంజీవికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే.. రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :