ASBL NSL Infratech

ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్ ...పోలింగ్ శాతం ఇలా!

ప్రశాంతంగా ముగిసిన రెండో దశ  పోలింగ్ ...పోలింగ్ శాతం ఇలా!

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో దశ  పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రికత్తలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం  6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్‌ ముగించారు. సమయం ముగిసిప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.  కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్‌ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర, రాజస్థాన్‌లో బన్స్‌వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్బానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు.

రాష్ట్రాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు అస్సాంలో 70.66 శాతం పోలింగ్‌ నమోదు కాగా, బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్‌ 72.13, జమ్మూకశ్మీర్‌ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్‌ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్‌ 76.06, రాజస్థాన్‌ 59.19, త్రిపుర 77.53, ఉత్తర ప్రదేశ్‌ 52.74, పశ్చిమబెంగాల్‌ 71.84 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :