సిద్దూకి ఇదే అసలైన పరీక్ష
సిద్దూకి ఇదే అసలైన పరీక్షడీజే టిల్లుతో మంచి హిట్ కొట్టిన సిద్దూ జొన్నలగడ్డ ఆ తర్వాత ఎన్ని సినిమా ఛాన్సులొచ్చినా చేయకుండా టిల్లు స్వ్కేర్ మీద నమ్మకంతో ఆ సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు. తన నిరీక్షణకు ఫలితంగా టిల్లు స్వ్కేర్ మంచి హిట్ అయింది. దీంతో ఇప్పుడు సిద్దూ తను తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు. నిదానమే ప్రధానం అనే ఫార్ములా పాటిస్తూ సిద్దూ సినిమాలను ఎంచుకుంటున్నాడు.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్, నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు సిద్దూ. ఈ రెండు కాకుండా టిల్లు క్యూబ్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యాక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. డైరెక్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సారి కూడా డైరెక్టర్ ను మార్చాలని చూస్తున్నారట. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ చేతిలో టిల్లు క్యూబ్ పెట్టాలని చూస్తున్నారట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కాకుండా సిద్దూ ఒప్పుకున్న సినిమాలేవీ లేవు. వాస్తవానికైతే వీటికంటే ముందే సిద్దూ,నందినీ రెడ్డితో ఓ సినిమా చేయాల్సింది కానీ అన్నీ మంచి శకునములే సినిమా ఫ్లాప్ అవడంతో ఆ కాంబోలో సినిమాకు బ్రేక్ పడింది. మొహమాటం కోసం రిస్క్ చేస్తే కెరీర్ రిస్క్ లో పడుతుందని గుర్తించి దానికనుగుణంగా అడుగులేస్తున్నాడు సిద్దూ. అయితే ఇప్పుడు సిద్దూకి మరో సవాల్ ఉంది. ఇప్పటివరకు సిద్దూకు బాగా క్రేజ్ తెచ్చిన సినిమా అంటే టిల్లు సిరీసే. తనకు మాత్రమే కుదిరే బాడీ లాంగ్వేజ్, టైమింగ్ తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసిన సిద్దూ ఇప్పుడు జాక్ సినిమా కోసం తన లుక్స్ మొత్తాన్ని మార్చాడు. వేరే జానర్, క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు సిద్దూపై ఉంది. అందుకే సిద్దూ తర్వాతి సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.