ASBL NSL Infratech

మరోసారి ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అదీ ఒకటి

మరోసారి ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అదీ ఒకటి

2021లో క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడిలో భాగమై జైలుకెళ్లిన వారిని విడిపిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మరోసారి ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అదీ ఒకటని వెల్లడించారు. ఈ సందర్బంగా జైలు శిక్ష అనుభవిస్తోన్న వారిని బందీలు అని అభివర్ణించారు.  సరిహద్దులను మూసివేయడం, అన్యాయంగా జైల్లో ఉంచిన జనవరి 6 బందీలను విడిపించడం మీ తదుపరి అధ్యక్షుడిగా నేను తీసుకునే తొలినిర్ణయాలు అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.  2021 జనవరి 6న ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిల్‌ భవనంపై భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :