ASBL NSL Infratech

ఉక్రెయిన్ సైన్యంలో కీలక మార్పు : జెలెన్స్కీ

ఉక్రెయిన్ సైన్యంలో కీలక మార్పు : జెలెన్స్కీ

రష్యాతో యుద్ధం ఉద్ధృతంగా కొనసాగుతున్నవేళ ఉక్రెయిన్‌ సైన్యంలో కీలక మార్పు చోటు చేసుకుంది. సైన్యానికి కొత్త కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా జనరల్‌ ఒలెక్సాందర్‌ సియర్‌స్కై (58)ని దేశాధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ నియమించారు. ఇన్నాళ్లూ ఆ బాధ్యతలను జనరల్‌ వలేరీ జలుజ్నీ నిర్వర్తించారు. ఆయన్ను సైన్యాధిపతి పదవి నుంచి జెలెన్‌స్కీ తప్పిస్తారని ఇటీవలి కాలంలో జోరుగా వార్తలొచ్చాయి. వాటిని దేశాధ్యక్షుడి కార్యాలయం తొలుత ఖండించింది. అయితే తాజాగా యుద్ద వ్యూహంలో మార్పు రావాలంటూ జనరల్‌ జులూజ్నీ టెలిగ్రామ్‌ లో ఓ సందేశాన్ని ఉంచడం, ఆ వెంటనే జనరల్‌ సియర్‌స్కైని జెలెన్‌స్కీ నూతన కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా నియమించడం చకచకా జరిగిపోయాయి. జనరల్‌ సియర్‌స్కై ఇప్పటిదాకా ఉక్రెయిన్‌ భూతల బలగాల కమాండర్‌గా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :