ASBL NSL Infratech

దిల్ రాజు న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాడా?

దిల్ రాజు న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాడా?

ఏదైనా చిన్న సినిమా డైరెక్ట‌ర్ మంచి స‌క్సెస్ సాధిస్తే అత‌నికి త‌ర్వాత ఆఫ‌ర్లు రావ‌డం ప‌క్కా కానీ వెంట‌నే పెద్ద ఆఫ‌ర్లు రావ‌డం మాత్రం చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. రాజావారు రాణిగారు తో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు మంచి డెబ్యూ ఇచ్చిన డైరెక్ట‌ర్ ర‌వికిర‌ణ్ కోలా త్వ‌ర‌లోనే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. తాజాగా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.

పూర్తి డీటెయిల్స్ మే 9న విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అనౌన్స్ చేయ‌నున్నారు. ర‌వి కిర‌ణ్ మొద‌టి సినిమా బ్లాక్ బ‌స్ట‌రేమీ కాదు. రిజ‌ల్ట్ గురించి ప‌క్క‌న పెడితే ఇప్పుడు ఆయ‌న ముందు చాలా స‌వాళ్లున్నాయి. అందులో మొద‌టిది విజ‌య్ ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించ‌డం. గీతా గోవిందం త‌ర్వాత విజ‌య్ మ‌ళ్లీ ఆ స్థాయి స‌క్సెస్ ను అందుకుంది లేదు.

రీసెంట్ గా వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా తీవ్రంగా నిరాశ ప‌రిచింది. దీంతో ఇప్పుడా బాధ్య‌త విజ‌య్ చేయ‌బోయే త‌ర్వాతి సినిమాల డైరెక్ట‌ర్ల మీద ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మామూలు యువ‌కుడు వ్య‌వ‌స్థ‌ని శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడ‌నే పాయింట్ మీద ర‌వికిర‌ణ్ చాలా కొత్తగా స్క్రిప్ట్ ను రాసుకున్నాడట‌. విన‌డానికి స్టోరీ లైన్ మామూలుగా అనిపించిన‌ప్ప‌టికీ చాలా ట్విస్టుల‌తో విభిన్నంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రొక‌టి త‌న పైన దిల్ రాజు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌గ‌లగాలి. అది చేయ‌గ‌లిగితే ర‌వికిర‌ణ్ కు మంచి ఫ్యూచ‌ర్ గ్యారెంటీగా ద‌క్కుతుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :