ASBL NSL Infratech

గాజు గ్లాస్ డ్రామాను జగన్ ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్న పవన్..

గాజు గ్లాస్ డ్రామాను జగన్ ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్న పవన్..

జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా కేటాయించింది. దీంతో వాళ్లు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని దగ్గర్ల అది స్వతంత్ర అభ్యర్థుల కోరిక మేరకు కేటాయించాల్సి వస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది కూటమి గెలుపు పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. దీనికి ముఖ్య కారణం జగన్ అని పవన్ ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అన్ని కరెక్ట్ గా పట్టించుకుని ఉంటే ఈరోజు గాజు గ్లాసు గుర్తుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే విషయాన్ని పక్కన పెట్టి.. తనకు వచ్చేస్తున్న పాపులారిటీ చూసి తట్టుకోలేక జగన్ ఇలా చేస్తున్నాడు అని పవన్ కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసి మరి గాజు గ్లాసు గుర్తు స్వతంత్రులకు కేటాయించేలా చేయాల్సిన అవసరం జగన్ కి ఏముంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అలాగా చేయాలి అనుకుంటే ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు అసలు జనసేన అభ్యర్థులకు రాకుండా కూడా చేసి ఉండేవారు కదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్న గుర్తు కూడా తెచ్చుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.. అది చూసుకోకుండా ఆ ఫ్రస్టేషన్ తీసుకువచ్చి జగన్ పై పెట్టడం ఎంతవరకు సబబు అని ఎద్దేవా చేస్తున్నారు. దాహం వేస్తే భావి తవ్వాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని మరి కొంతమంది అంటున్నారు. మొత్తానికి పగిలేకొద్దీ పదునెక్కే గాజు గ్లాసు.. కూటమికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.



 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :