ASBL NSL Infratech

ఈ ఇయ‌ర్ దేవీదే!

ఈ ఇయ‌ర్ దేవీదే!

టాలీవుడ్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ గురించి, ఆయ‌న సాధించిన స‌క్సెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేవీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పాతికేళ్లవుతోంది. దేవి సినిమాతో త‌న జ‌ర్నీ స్టార్ట్ చేసిన‌ డీఎస్పీ మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఆనందం, క‌లుసుకోవాలని, సొంతం లాంటి సినిమాల‌తో మ్యూజిక‌ల్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటూ వ‌చ్చాడు.

త‌క్కువ టైమ్ లోనే టాప్ మేక‌ర్స్ దృష్టిలో ప‌డ్డ దేవీ, తెలుగుతో పాటూ త‌మిళంలో కూడా సినిమాలకు సంగీతం అందిస్తూ వ‌స్తున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ హీరోలంద‌రితో దేవీ వ‌ర్క్ చేశాడు. ఇక పుష్ప సినిమాతో దేవీ క్రేజ్ ఏంట‌న్న‌ది ప్రపంచమంతా తెలిసిపోయింది. పుష్ప సినిమాకు దేవీ ఇచ్చిన మ్యూజిక్ ప్ర‌తి ఒక్క సెలబ్రిటీతో స్టెప్పులేయించింది.

గ‌తేడాది దేవీ నుంచి వాల్తేరు వీర‌య్య సినిమా మాత్ర‌మే వ‌చ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం డీఎస్పీ ప‌లు పాన్ ఇండియా సినిమాల‌తో చేతి నిండా ప‌నితో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా పుష్ప‌2 నుంచి రిలీజైన టైటిల్ సాంగ్ కు ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో పాటూ కుబేర నుంచి నాగ్ ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్ కూడా రిలీజవ్వ‌డంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దేవీ ట్రెండ్ అవుతున్నాడు. ఈ గ్లింప్స్ కు దేవీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ రెండు సినిమాల‌తో పాటూ దేవీ.. నాగ‌చైత‌న్య తండేల్, RC17, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. ఇవ‌న్నీ చూస్తుంటే ఈ ఏడాది దేవీ సౌండ్ గ‌ట్టిగానే వినిపించేలా అనిపిస్తోంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :