ASBL NSL Infratech

వేడెక్కిస్తున్న వాణి కపూర్ ఫోజులు..

వేడెక్కిస్తున్న వాణి కపూర్ ఫోజులు..

వాణి కపూర్ అంటే తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ హీరోయిన్ బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హిందీలో "శుద్ధ్ దేశి రొమాన్స్" అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రెండవ సినిమా దక్షిణాదిలో నాచురల్ స్టార్ నానితో కలిసి "ఆహా కళ్యాణం" అనే సినిమాలో నటించింది.

ఆ తరువాత రణబీర్ కపూర్ సరసన ఈ అమ్మడు బేఫికర్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా ఆమెకు వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సినిమా వాణి కపూర్ కి బాగానే కలిసొచ్చినట్టు చూపొచ్చు. గత ఏడాది విడుదలైన షంషేరా అనే సినిమాలో కూడా నటించింది.

ప్రెజెంట్ ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతోంది ఈ భామ. సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సూపర్ స్టిల్స్ తో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది వాణికపూర్. తాజాగా ఈ అమ్మడు ఒక డిజైనర్ గౌనులో మెరిసింది. అంతేకాక ఈ ఫోటోకి ఒక హాట్ క్యాప్షన్ కూడా పెట్టింది. "ప్రస్తుతానికి ప్రపంచమంతా శీతాకాలంలో ఉంటే.. కొన్నిచోట్ల మాత్రం సమ్మర్ ఉంది.. "అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. ఈ ముద్దుగుమ్మ స్టిల్స్ కి కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :