ASBL NSL Infratech

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు...

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు...

ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు.. పశ్చిమాసియాను కుదిపేస్తున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయభార కార్యాల కాన్సులర్‌ విభాగంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడం..అందులో ఏడుగు సైనికాధికారులు మృతి చెందడంపై ఇరాన్ భగ్గుమంటోంది.. ఈ చర్యకు ప్రతిచర్య తప్పదని ఇప్పటికే ఇరాన్‌... ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. మాపై దాడులు చేస్తున్న శత్రుమూకలకు తగిన సమాధానం చెబుతాం’’ అని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ కమాండర్ హుస్సైసీ సలామీ హెచ్చరించారు. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా ఉన్న అమెరికాకు సైతం ఇరాన్ హెచ్చరికలు చేసింది. ప్రతిదాడి విషయంలో అమెరికా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అమెరికా జాగ్రత్త.. నెతన్యాహు ఉచ్చులో పడొద్దు అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు ఇరాన్ ప్రతినిధులు.

తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాన్ దాడి తప్పదన్న అంచనాకు వచ్చిన అగ్రరాజ్యం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా తన సైన్యాలను హెఅలర్ట్‌లో పెట్టింది. జీపీఎస్ నావిగేషన్ నిలిపివేసింది. సైనికుల సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్థ్యం విస్తరిస్తోంది. తమ సరిహద్దులన్నింటిలోనూ బలగాలను మోహరించింది.

ముందు జాగ్రత్త చర్యలుగా అన్నిచోట్ల బాంబు షెల్టర్‌లను తెరిచింది. అయితే, ఇరాన్‌ ఎలాంటి దాడి జరపొచ్చన్న అంశంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు ఇజ్రాయెల్‌లోని నిఘా, సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఇరాన్ దాడికి తెగబడితే ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కూడా అమెరికా కసరత్తు చేస్తోంది. డ్రోన్స్ లేదా మిస్సైళ్ల ప్రయోగంతో ఇరాన్‌పై ప్రతిదాడి చేయాలనే అంచనాకు వచ్చింది. మరోవైపు..మధ్యప్రాచ్యంలోని తన స్థావరాలను భద్రంగా ఉంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది బైడన్ సర్కార్..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :