హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న ఆసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సలేట్

హైదరాబాద్‌లో ప్రారంభంకానున్న ఆసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సలేట్

హైదరాబాద్ నగరంలో ఆసియాలోనే అతిపెద్ద యూఎస్ కాన్సలేట్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ కార్యాలయం ప్రారంభం అవుతుందని సమాచారం. దీని ఏర్పాటు కోసం 297 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 12.2 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ భవనంలో.. 54 వీసా ఇంటర్వ్యూ విండోస్ కూడా ఉంటాయి. దీని వల్ల వీసా దరఖాస్తు, మంజూరు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. హైదరాబాద్‌లో 2009లో యూఎస్ కాన్సలేట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వతంత్రం తర్వాత భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి యూఎస్ కాన్సలేట్ కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అమెరికా ఆసక్తులను ప్రచారం చేస్తూ, ఈ రాష్ట్రాలతో యూఎస్ సంబంధాలను ప్రతిబింబించడం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సలేట్ జనరల్ బాధ్యత.

 

 

Tags :