ASBL NSL Infratech

రిలీజ్ డేట్ మార్చుకున్న "ఉగ్రం"..

రిలీజ్ డేట్ మార్చుకున్న "ఉగ్రం"..

అల్లరి నరేష్ టాలీవుడ్ కామెడీ స్టార్ గా అందరికి సుపరిచితమే. " అల్లరి " సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు ఈ హీరో. తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ కామెడీ సినిమాలకి అల్లరి నరేష్ కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పొచ్చు. కితకితలు మూవీ తో తన సత్తా ఏంటో తెలుగు ఆడియన్స్ కి చూపించాడు ఈ హీరో. ప్రముఖ దర్శకుడి తనయుడు అయినప్పటికీ తన ఓన్ టాలెంట్ తో, కామెడీ సినిమాలతో తన మార్క్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నాడు నరేష్.

అల్లరి నరేష్ తన కెరీర్ లో తర్వాత ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలవైపు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. " నేను " సినిమాలో ఒక డిప్రెస్డ్ పర్సన్ గా ఎంతో అద్భుతంగా నటించి, కామెడీ మాత్రమే కాదు ఏ పాత్రనైనా తాను పోషించగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అలా " గమ్యం " వంటి చిత్రాలతో ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు ఈ హీరో. ఇక ఈ సీరియస్ జోనర్ లోనే ఆడియన్స్ ని మరొకసారిరి పలకరించడానికి రెడీ అయ్యాడు అల్లరి నరేష్. " ఉగ్రం " అంటూ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు ఈ హీరో.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న మూవీ ఉగ్రం. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకుముందే ఈ కాంబినేషన్ లో వచ్చిన నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని అందుకుంది. అయితే ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ 14 న థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని మే 5 న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఈ కాంబో రిపీట్ అవుతున్న తరుణంలో ఉగ్రం ఎలా ఉంటుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :