ASBL NSL Infratech

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా... 14 వేల మందిని

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా... 14 వేల మందిని

ఎలాన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగ కోతలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 14 వేల మందిపై ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్‌ మాస్క్‌ లేఖ రాసినట్లు తెలిసింది.  ప్రపంచవ్యాప్తంగా గతేడాది డిసెంబర్‌ నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో పది శాతం అంటే దాదాపు 14 వేల మందిని టెస్లా తొలగించనుంది. కొన్ని రోల్స్‌లో డూప్లికేష్‌ కారణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.  కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్న వారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే తొలగించిన ఉద్యోగులకు సిస్టమ్‌ యాక్సెస్‌ నిలిపివేసినట్లు సమాచారం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :