ASBL NSL Infratech

అమెరికా ఎలక్ట్రిస్‌ కార్ల సంస్థ టెస్లా... చైనాలో

అమెరికా ఎలక్ట్రిస్‌ కార్ల సంస్థ టెస్లా... చైనాలో

అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో అన్ని రకాల మోడల్‌ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలో నూ కార్ల ధరలు తగ్గించిన ఎలాన్‌ మస్క్‌ కంపెనీ టెస్లా తాజాగా చైనాలోనూ ధరలు తగ్గించింది. టెస్లా కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌ 3 కారు ధర 14 వేల చైనా యువాన్లు ( 1930 అమెరికా డాలర్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా మోడల్‌ 3 కారు ధర 2, 31,900 యువాన్లకు తగ్గించినట్టు చైనా టెస్లా వెబ్‌సైట్‌ పేర్కొంది. అమెరికా డాలర్లతో పోలిస్తే 32 వేల డాలర్లు.

అలాగే టెస్లా మోడల్‌ వై కారు ధర రూ.2,49,900 చైనా యువాన్లు, రెగ్యులర్‌ వర్షన్‌ మోడల్‌ -ఎస్‌ 6,84,900 చైనా యువాన్లు, మోడల్‌ -ఎస్‌ 8,14,900 చైనా యువాన్లు మోడల్‌ మోడల్‌-ఎక్స్‌ 8,24,900 నుంచి 7,24,900 యువాన్లకు తగ్గించింది. అమెరికాలోనూ మోడల్‌ -వై, మోడల్‌ -ఎక్స్‌, మోడల్‌-ఎస్‌ కార్ల ధరలు 2000 డాలర్లు తగ్గింది. ఇక ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ధర 8000 డాలర్ల నుంచి 12 వేల డాలర్లకు తగ్గించారు. 2024 తొలి త్రైమాసికంలో గ్లోబల్‌ మార్కెట్లో టెస్లా కార్ల విక్రయాలు పడిపోయాయి. గత నాలుగేల్లలో ఒక త్రైమాసికంలో కార్ల విక్రయాలు పడిపోవడం ఇదే తొలిసారి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :