ASBL NSL Infratech

దేశంలోనే తొలిసారిగా ... చేనేత కార్మికులకు

దేశంలోనే తొలిసారిగా ... చేనేత కార్మికులకు

దేశంలోనే తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా పథకం అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా పథకం తీసుకొస్తున్నామని, దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. 60ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికునికీ బీమా వర్తిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందని, దీంతో భరోసా కలుగుతుందని అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :