ASBL NSL Infratech

టీఏజీడీవీ ఉగాది పోటీలు

టీఏజీడీవీ ఉగాది పోటీలు

తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ డెలవేర్‌ వ్యాలీ (టీఏజీడీవీ) సాంస్కృతిక పోటీలు నిర్వహించింది. పెన్సిల్వేనియలోని 1612 కౌంటీ లైన్‌ రోడ్‌లోని భారతీయ టెంపుల్‌లో ఈ పోటీలు నిర్వహించారు. అన్ని వయసుల వారూ పాల్గొనేలా క్లాసికల్‌, నాన్‌-క్లాసికల్‌ పోటీలను టీఏజీడీవీ ఏర్పాటు చేసింది. ఈ వేడుకల్లో 86 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. ఈ పోటీల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రవి కామరాసు, గురు శ్రీమతి అన్నపూర్ణ చాగంటి, గురు శ్రీమతి శ్రీసుధ విశ్వనాథ్‌, గురు శ్రీమతి స్వప్న శ్రీధరన్‌, గురు శ్రీమతి భారతీ అశోక్‌, గురు శ్రీనివాస్‌ చాగంటి, సింధు బుధవారపులను టీఏజీడీవీ ప్రెసిడెంట్‌ ముజీబుర్‌ రెహ్మాన్‌ సాదర స్వాగతం పలికారు.

ఈ పోటీలను సురేష్‌ బొండుగుల, రమణ రాకోతు, శివ్‌ అన్నాతుని నేతృత్వంలోని టీజీడీవీ కల్చరల్‌ సమర్థవంతంగా నిర్వహించింది. ఈసీ రాజు కక్కెర్ల, సాయి సుదర్శన్‌ కూడా కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అలాగే వాలంటీర్ల బృందం కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో కృషి చేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో చైర్‌ సాయి కొత్తపల్లి, కో-చైర్‌ యుక్త ఆధ్వర్యంలోని టీఏజీడీవీ యూత్‌ కమిటీ.. కుకీ స్టాల్‌ నిర్వహించి, ఛారిటీ కోసం విరాళాలు సేకరించారు. టీఏజీడీవీ మాజీ ప్రెసిడెంట్లు హరనాథ్‌ దొడ్డపనేని, హరి బుంగతావుల ఈ కార్యక్రమానికి విచ్చేసి.. పోటీల్లో పాల్గొన్న చిన్నారులను ప్రోత్సహించారు.. అలాగే టీఏజీడీవీ ఈసీ, న్యాయనిర్ణేతల కృషిని కూడా కొనియాడారు. ఈ పోటీలు నిర్వహించేందుకు అనుమతించిన భారతీ టెంపుల్‌ను టీఏజీడీవీ సెక్రటరీ హరీష్‌ అన్నాబత్తిన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన టీఏజీడీవీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, వాలంటీర్‌ టీమ్స్‌ను ప్రశంసించారు.

 

Click here for Event Gallery

 



 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :