ASBL NSL Infratech

టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోలో 55కిపైగా ప్రముఖ కంపెనీల స్టాల్స్...

టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోలో 55కిపైగా ప్రముఖ కంపెనీల స్టాల్స్...

తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంపై టీ న్యూస్‌ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్స్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ ప్రాపర్టీ షో 2021కి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షోలో దాదాపు 55కి పైగా కంపెనీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్‌ గ్రూపు భాగస్వామ్యంతో టీ న్యూస్‌ ఈ ప్రాపర్టీ షోను సమర్పిస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎప్పుడూ ముందుంటున్న హైదరాబాద్‌ రియల్‌ రంగం ఇప్పుడు మరింత జోరుగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తమ పెట్టుబడుల కోసం హైదరాబాద్‌కు ప్రాముఖ్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే.  కోవిడ్‌ తరువాత ఇప్పుడే రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంటున్న తరుణంలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాపర్టీ షోను టీ న్యూస్‌ ఏర్పాటు చేసింది. గత 11 సంవత్సరాల్లో తెలుగు న్యూస్‌ ఛానళ్ళలో నెంబర్‌ 1 ఛానల్‌గా పేరు తెచ్చుకున్న టీ న్యూస్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీస్‌పై ప్రతి సంవత్సరం షోలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

బడ్జెట్‌ అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్స్‌ నుంచి ప్రీమియమ్‌ విల్లాస్‌ వరకు అందరికీ అందుబాటు ధరలో మీ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది. దానికి ఓపెన్‌ వెంచర్లతోపాటు చిన్న, పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల వివరాలను తెలుసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో వల్ల కలుగుతుంది. మార్చి 13, 14 తేదీల్లో జరిగే ఈ ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితమేనని నిర్వాహకులు తెలిపారు. 

ఈ ప్రాపర్టీ షో లో ఓవర్సీస్‌ మీడియా పార్టనర్‌గా 'తెలుగుటైమ్స్‌' వ్యవహరిస్తోంది. అమెరికాలో గత 17 సంవత్సరాలుగా ప్రచురితమవుతూ, వెబ్‌ మీడియా ద్వారా విదేశాంధ్రులకు సమాచార వేదికగా ఉంటున్న 'తెలుగుటైమ్స్‌' అమెరికాలో జరిగే తానా, ఆటా, నాటా, నాట్స్‌, టాటా వంటి జాతీయ సంఘాలు నిర్వహించే మహాసభల్లో మీడియా పార్టనర్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర ప్రాంతీయ తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా తెలుగుటైమ్స్‌ పాలుపంచుకుంటోంది. మొదటిసారిగా టీ న్యూస్‌ ఏర్పాటు చేసిన ఈ గోల్డెన్‌ ప్రాపర్టీ షో 2021లో తెలుగుటైమ్స్‌ భాగస్వామ్యం అవుతోంది. ఈ షోకి ఓవర్సీస్‌ మీడియా పార్టనర్‌గా తెలుగుటైమ్స్‌ను ఎంపిక చేసినట్లు టీ న్యూస్‌ నిర్వాహకులు గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. 

praneet praneet praneet obili-garuda

ఈ షోలో తెలుగు టైమ్స్‌ కూడా ఓ స్టాల్‌ను ఏర్పాటు చేస్తోంది. అమెరికాలో తమ పత్రిక ఏ విధంగా అమెరికాలోని తెలుగు సంఘాలకు కనెక్ట్‌ అయిందో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వివిధ సంస్థలు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులపై ఇస్తున్న కవరేజీని కూడా అందరికీ ఈ స్టాల్‌ ద్వారా తెలియజేయనున్నది. తెలుగు రాష్ట్రాల్ల ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రాజెక్టులను అమెరికాలోని ఎన్నారైల దగ్గరకు చేరవేయడంలో తెలుగుటైమ్స్‌ సమాచార వారధిగా ఉంటున్న విషయం చాలామందికి తెలిసిందే. 

టీ న్యూస్‌ గోల్డెన్‌ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్న సంస్థల వివరాలు.

Vertex poulomi Png-jewelry
Tags :