ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కృష్ణ తత్వాన్ని అద్భుతంగా చెప్పిన ‘అరి’ సినిమా పాట

కృష్ణ తత్వాన్ని అద్భుతంగా చెప్పిన ‘అరి’ సినిమా పాట

పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’ మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోన్న సినిమా అరి. ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తాజాగా టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సింగర్ గా మారిన మంగ్లీ పాడిన తొలి పాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. కొన్నాళ్లుగా కాసర్ల శ్యామ్ సాహిత్యం, మంగ్లీ గాత్రంలో వస్తోన్న పాటలన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఈ గీతం కూడా ఆ కోవలోనే శ్రీ కృష్ణుడుపై సాగే అద్బుతమైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఈ గీతాన్ని తెలంగాణలోని మొదటి హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘ పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువుగారి చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. కాసర్ల శ్యామ్ గారు రాసిన ఈ పాటను మంగ్లీ చాలా అద్భుతంగా పాడింది. ఈ మధ్య మంగ్లీ పాడిన దేవుడి పాటలన్నీ గొప్ప విజయం సాధిస్తున్నాయి. ఆమెది నిజంగా డివైన్ వాయిస్. దర్శకుడు జయశంకర్ మంచి కాన్సెప్ట్ తో వచ్చాడు. అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం మా నిర్మాతలకు మంచి డబ్బులు కూడా తేవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను కూడా ఓ మంచి పాత్ర చేశాను. ప్రేక్షక దేవుళ్ల ఆశిస్సులతో ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘‘ ఈ అరి చిత్రంలో శ్రీ కృష్ణ తత్వాన్ని చిన్న చిన్న పదాలతో చెప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశం నాకు దేవుడే ఇచ్చాడు అని భావిస్తున్నాను. లక్ష్మీ నరసింహ స్వామి మా ఇలవేల్పు. ఆ దేవుని సమక్షంలో ఈ పాట విడుదల చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలందరినీ చిన్నికృష్ణులుగానే చూస్తాం. కానీ భగవద్గీత చదివితే కృష్ణ తత్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నా దృష్టిలో కృష్ణుడుని మించిన మేనేజ్మెంట్ గురు లేడు అనుకుంటాను. ఇక ఈ పాటను అనూప్ రూబెన్స్ గారు ఎంత గొప్పగా కంపోజ్ చేశారో.. అంతే అద్భుతంగా మంగ్లీ పాడింది. కృష్ణతత్వాన్ని చిన్న చిన్న పదాల్లో చెప్పే అవకాశం నాకు ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు, ఇస్కాన్ టెంపుల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పాటలో అనేక పద ప్రయోగాలు చేశాను. అలాంటి ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ పాటను శ్యామ్ గారు చాలా గొప్పగా రాశారు. మంగ్లీ గాత్రంలో మరింత అందంగా వినిపిస్తోంది. అనూప్ రూబెన్స్ గారు బాగా కంపోజ్ చేశారు. ఇప్పటికే యూ ట్యూబ్ లో వైరల్ అవుతోందీ పాట. ఈ పాటే కాదు సినిమా కూడా చాలా చాలా బావుంటుంది. డైలాగ్స్, స్క్రీన్ ప్లే దర్శకుడు జయశంకర్ చాలా బాగా రాసుకున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను..’’అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్  రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాట ట్యూన్ చాలా బావున్నాయి. దర్శకుడు జయశంకర్ మొదటి సినిమా నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. జయశంకర్ కథ చెప్పే విధానం చాలా బావుంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూపించబోతున్నాం అని చెప్పగలను. ఈ పాట  చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అలాగే సాయి కుమార్ గారి అద్భుత సినిమా ప్రస్థానంకు కూడా నేను పనిచేశాను. ఇది కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

నటి, యాంకర్ అంజలి మాట్లాడుతూ.. ‘‘కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన పాటను రాశారు. మంగ్లీ కూడా గొప్పగా పాడింది. ఈ ఆదివారంపూట మంచి దైవదర్శనం కలిగించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇస్కాన్ టెంపుల్ వారందరికీ నమస్కారం చెబుతున్నాను. ఈ సినిమాలో నేనూ ఓ మంచి పాత్ర చేశాను. ఈ పాత్ర నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని చెప్పారు.

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ గారు మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా మీ టీమ్ నుంచి రిక్వెస్ వచ్చిన తర్వాత మా టెంపుల్ పాలసీ ప్రకారం మేము ఇన్వాల్వ్ కాము. సినిమాలకు దూరమై పాతికేళ్లు దాటింది. కానీ లిరిక్స్ పంపించినప్పుడు చూడగానే.. ప్రతిఒక్క కృష్ణ భక్తుడు ఆనందపడేలా ఉంది. ప్రతి లైన్ చాలా బాగా వచ్చింది. ఇది భగవంతుడి అనుగ్రహం. ఆడియో సాంగ్ కూడా విన్న తర్వాత.. వీరికి అవకాశం కల్పించాలి అనిపించింది. సినిమా టైటిల్, కాన్సెప్ట్ చాలా బావుంది. పైగా అందరూ భక్తులే కావడం ఆనందం. అలాంటి మీరంతా.. ఈ క్షేత్రంలో కృష్ణుడిపైన ఇలాంటి మంచి పాటను విడుదల చేయడం దేవుడి అనుగ్రహం. అందరూ కూడా ఇంత మంచి పాటతో వస్తోన్న ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడాలి అని కోరుకుంటున్నాను.. ’’ అని చెప్పారు.

దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఇక్కడ పాట విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చిన ఇస్కాన్ టెంపుల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథ ప్రకారం కృష్ణుడు గురించి అందరికీ అర్థమయ్యేలా ఓ పాట కావాలని శ్యామ్ గారి వద్దకు వెళ్లాను.ఆయన కేవలం ఒక్క వారంలోనే కృష్ణుడి ఫిలాసఫీని, గీత తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా అద్బుతంగా రాసి ఇచ్చారు. దీనికి అనూప్ రూబెన్స్ గారు అద్భుతమైన ట్యూన్ ఇవ్వడం.. మంగ్లీగారి వాయిస్ పెద్ద ఎసెట్ అయింది. అయితే ఇంత గొప్ప పాట జనాల్లోకి వెళ్లాలంటే ఒక శక్తి కావాలి అనిపించింది. అప్పుడు మా అమ్మ ఇస్కాన్ వారి సాయం తీసుకోమని చెప్పింది. నేను రిక్వెస్ట్ పెట్టాను. ఫైనల్ గా సత్య గౌరవ్ గారిని రీచ్ అవగలిగాము. ఇదంతా చూస్తోంటే కృష్ణుడి ఆశీర్వాదాలు మా సినిమాకు ఉన్నాయనుకుంటున్నాను. ఈ పాట ద్వారా ఓ మంచి ఫిలాసఫీని చెప్పాం. మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి ఓ మంచి కథ బయటకు రావడానికి కారణమైన టేస్ట్ ఉన్న మా నిర్మాతలతో పాటు సాయికుమార్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను..’’ అన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :