ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఏమిటీ గ్యాస్‌ క్యానిస్టర్లు..?

ఏమిటీ గ్యాస్‌ క్యానిస్టర్లు..?

పార్లమెంటు కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్‌సభలో ప్రవేశించిన ఇద్దరు దుండగులు ..గ్యాస్ క్యానిస్టర్లతో అలజడి రేపారు. పార్లమెంటు లోపల, బయట పసుపు రంగుతో కూడిన పొగ విడుదల చేస్తూ ఎంపీలు, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. సంచలనం కోసం దుండగులు చేసిన ఈ చర్యతో యావత్‌ దేశం ఉలిక్కిపడింది. అయితే, ఇవి సాధారణ రంగులతో కూడిన వాయువులు విడుదల చేసేవేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడం ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో రంగులతో కూడిన గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏమిటన్న ఆసక్తి నెలకొంది.

దట్టమైన పొగను విడుదల చేసే డబ్బాలను స్మోక్‌ క్యానిస్టర్లు లేదా స్మోక్‌ బాంబులు అని పిలుస్తుంటారు. అధిక పీడనంతో కూడి ఉంటాయి. వీటిని భిన్న రకాలుగా ఉపయోగిస్తారు. భద్రతా సిబ్బంది మొదలు క్రీడలు, ఫొటో షూట్‌లలోనూ దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. చాలా దేశాల్లో వీటి వినియోగానికి అనుమతి ఉంది. రిటైల్‌ మార్కెట్లోనూ విరివిగా లభిస్తాయి.

గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను మిలటరీ, భద్రతా ఆపరేషన్లలో ఉపయోగిస్తుంటారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని వాడుతుంటారు.

మరోవైపు ఫొటో షూట్లలోనూ క్యానిస్టర్లను విరివిగా ఉపయోగిస్తారు. కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ ఎఫెక్టులను సృష్టించేందుకు వివిధ రంగుల్లోని క్యానిస్టర్లను వాడుతారు. ఫుట్‌బాల్‌ వంటి క్రీడల సమయంలో వీటిని ఎక్కువగా చూస్తుంటాం. వివిధ క్లబ్బులకు సంబంధించి ఆయా రంగులను ప్రదర్శించడానికి అభిమానులు ఈ క్యాన్‌స్టర్లను వాడుతుంటారు. అంతే కాదు.. ఇటీవలే జరిగిన ఐపీఎల్ తరహా గేమ్స్ లోనూ వీటిని విరివిగా వాడడం అందరికీ తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :