ఇండియా నుండి ఎంపికయిన ఒకే ఒక నటుడు
బాలీవుడ్ షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పలువురు రాజకీయ నాయకులు కూడా సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 50 మంది నటుల జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క నటుడు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు చోటు దక్కడం విశేషం. బ్రిటన్కు చెందిన ఎంఫైర్ మ్యాగజైన్ ఈ జాబితాను వెల్లడించింది. ఎంఫైర్ మ్యాగజైన్ కథానాన్ని షారుఖ్ మేనేజర్ పూజా దద్తానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్టైమ్ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజర్ వాషింగ్టన్, టామ్ హాంక్న్, ఆంథోని మార్లన్ బ్రాండో వంటి దిగ్జజాలతో పాటు షారుఖ్ ఖాన్కు కూడా ఇందులో చోటు దక్కింది.
Tags :