ASBL NSL Infratech

వాస్తవికతకే వైసీపీ మేనిఫెస్టో పెద్దపీట... అలవికాని హామీలు ఇవ్వలేనన్న జగన్

వాస్తవికతకే వైసీపీ మేనిఫెస్టో పెద్దపీట... అలవికాని హామీలు ఇవ్వలేనన్న జగన్

ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో తాము 2019లో చెప్పిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చామని జగన్ చెప్తున్నారు. మేనిఫెస్టోను తాము పవిత్రంగా చూస్తామని.. అలవికాని హామీలు ఇవ్వబోమని మరోసారి తేల్చి చెప్పారు. తాము చేయగలిగేటివే చెప్తామని.. ప్రజల మెప్పుకోసం చేయలేని వాటిని చెప్పబోమని వివరించారు. మొత్తంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాలకు ప్రస్తుత మేనిఫెస్టో కొనసాగింపుగా ఉంది. ఈ ఐదేళ్లలో అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పటికే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అవన్నీ ప్రజాకర్షకంగా ఉండడంతో వైసీపీ కూడా ఈసారి అలాంటి హామీలు ఇస్తుందేమోనని అందరూ ఊహించారు. అయితే అలాంటి వాటికి చెక్ పెడుతూ తాను అలాంటి వాటికి దూరమని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేల పెన్షన్ ను రూ.3500లకు పెంచుతున్నట్టు చెప్పారు. అయితే పెంచే ఆ 500 చివరి రెండు సంవత్సరాల్లో ఇస్తామన్నారు. చేయూత పథకం కింద ఇప్పుడిస్తున్న రూ.75వేలను 4 విడతల్లో రూ.లక్ష 50వేలకు పెంచుతామన్నారు. అమ్మఒడిని రూ.15వేల నుంచి రూ.17వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. పెంచే ఆ రూ.2వేలు స్కూలు మెయింటెనెన్స్ కు వెళ్తుందన్నారు. కాపునేస్తాన్ని రూ.60వేల నుంచి రూ.లక్ష 20వేలకు 4 విడతల్లో పెంచుతామన్నారు జగన్.

రాజధానుల అంశంపై తన మాటకు కట్టుబడి ఉన్నట్టు జగన్ స్పష్టం చేశారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత అంశాల్లో ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో స్కిల్ కాలేజ్, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టును పూర్తి చేస్తామన్నారు.

తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని.. అంతకుముందు చంద్రబాబు హయాంతో పోల్చుతూ జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బాబు వస్తే అభివృద్ధి జరుగుతుందని, సంపద సృష్టిస్తారనేది అసత్యమని చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎన్నడూ సంపద సృష్టి జరగలేదన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :